నిర్వాహకులకు లాభాలే ఇష్టం.. ఆర్టీవోలకు మామూళ్ల ప్రీతి

నిర్వాహకులకు లాభాలే ఇష్టం.. ఆర్టీవోలకు మామూళ్ల ప్రీతి

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఔను.. కావేరీ వేమూరి బస్సు.. స్లీపర్ కోచ్ , నడిపేది స్పీడీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బెంగుళూరు (Hyderabad to Bengaluru) వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు (DD 01 AN 9190) కర్నూలు జిల్లా చిన్నటేకూరు లో ప్రధాన రహదారిపై పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు 23 మంది దుర్మరణం చెందారు.

అసలు ఈ బస్సు బాగోతం ఏంటీ? ఇది గోవా రిజిస్ర్టేషన్ బస్సు. ఫిట్ నెస్ లేదు. ఇన్సూరెన్సు లేదు. టాక్స్ వాలిడిటీ లేదు. ఆలిండియా పర్మిట్ (All India Permit) అసలే లేదు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక పరిధిలో ప్రతిరోజు ట్రిప్పులే ట్రిప్పులు. అధికారుల పట్టించుకోరు. అడిగేవాడూ లేడు. ఇప్పటికి కావేరీ యాజమాన్యానికి 23,500 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. చార్జీలు కావేరీ ఇష్టం. ఆర్టీవోలకు మామూళ్ల ప్రీతి. కనీసం కన్నెత్తి చూడరు. పోయేది జనం ప్రాణాలే. కనీసం బాధిత కుటుంబాలకు పరిహారమూ దక్కదు.

Leave a Reply