రైలు ఢీకొని వ్యక్తి మృతి

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన చిట్యాల ఈశ్వర్ నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతున్న సమయంలో కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
