Mallepally | ఆత్మసాక్షిగా చెబుతున్నా… అభివృద్ధి చేస్తా…

Mallepally | ఆత్మసాక్షిగా చెబుతున్నా… అభివృద్ధి చేస్తా…
మల్లెపెల్లి సర్పంచ్ అభ్యర్థి ఎరుకల తులసి రవి
Mallepally | మంథని : ఆత్మసాక్షిగా చెప్తున్నాను ఆశీర్వదించండి.. ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని మల్లెపెల్లి సర్పంచ్ అభ్యర్థి ఎరుకల తులసి రవి ప్రజల్ని కోరుతున్నారు. ఉంగరం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని అవకాశం కల్పించాలని ఆమె ప్రచారం చేస్తున్నారు. ఆమెకు ప్రచారంలో ప్రజలంతా అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మంథని మండలం మల్లేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎరుకల తులసి రవి బరిలో ఉన్నారు. గ్రామంలో వాడవాడలా ప్రజలతో మమేకమవుతూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఉంగరం గుర్తుకు ఓటెయ్యాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆమె తెలుపుతున్నారు. గ్రామ అభివృద్ధిలో మంచి మార్పును చూపడానికి
అన్ని వర్గాలతో మమేకమై గ్రామ అభివృద్ధే ధ్యేయంగా మల్లెపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన తనకు సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని ప్రజల నుండి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గ్రామంలో నూతన రోడ్లు నిర్మించడానికి కృషి చేస్తానని, వృద్ధులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాటు చేస్తానన్నారు. కాగా మన గ్రామంలోని అన్ని సమస్యల పరిష్కారానికి తన వంతుగా పోరాటం చేస్తానని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో గల్లిగల్లీకి డ్రైనేజీ నిర్మాణం, సీసీరోడ్ల నిర్మాణం, క్రీడలపై ప్రత్యేక కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మెగా వైద్య శిబిరం ఏర్పాటు, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇస్తున్నారు. ఎన్నికల కమిషన్ కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. సర్పంచ్ ఎన్నికల ఇంటింటి ప్రచారంలో అందరి ఆదరణతో దూసుకుపోతున్నారు.
