Mallavva | గ్రామ అభివృద్ధి కోసం ఓటేయండి

Mallavva | గ్రామ అభివృద్ధి కోసం ఓటేయండి
Mallavva | ధర్మపురి, ఆంధ్రప్రభ : నక్కలపేట గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు ఓటేయాలని సర్పంచ్ అభ్యర్థి నల్ల మల్లవ్వ కోరారు. ఆదివారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామానికి అత్యధికంగా నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసి మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని గెలిపించాలని ఆమె కోరారు
