Mallanna | అంగరంగ వైభంగా కళ్యాణ మహోత్సవం

Mallanna | అంగరంగ వైభంగా కళ్యాణ మహోత్సవం

  • మల్లన్నకు చల్ల అంబల్ల కార్యక్రమం

Mallanna | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ మల్లన్న దేవునికి చల్లని అంబళ్ళను భక్తులు సమర్పించిన మొక్కులు తీసుకున్నారు. జాతర ప్రారంభమైన రెండో రోజైన ఈ రోజు ఎడ్బిడ్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాల నుండి కాకుండా ఇతర మండలాల్లో ఈతర మండలంలోని గ్రామాల నుండి భక్తులు కాలినడకలతో చల్లని అంబళ్లను నెత్తి పైన తీసుకొచ్చి మొక్కలను తీసుకున్నారు. ఆలయంలో భక్తులు సత్యనారాయణ వ్రత పూజలు చేశారు.

అలాగే జాతర ప్రారంభమైన మొదటి శనివారం రాత్రి దేవుని కళ్యాణ మహోత్సవం వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. మల్లన్న దేవుని కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు తరలివచ్చారు. నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర బుధవారం వరకు కొనసాగుతుంది. అదేవిధంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సర్పంచ్లకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply