Malkapur | భారీగా కాంగ్రెస్‌లో చేరికలు

Malkapur | భారీగా కాంగ్రెస్‌లో చేరికలు
Malkapur | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రామంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జి పబ్బు రాజుగౌడ్ సమక్షంలో శ్రీ అందోల్ మాత ట్రాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఈడుదుల మస్తాన్ బాబును సర్పంచ్‌గా గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా అసోసియేషన్ అధ్యక్షులు దోనూరు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ పార్టీలో చేరిన వారిలో పక్కిరు జంగారెడ్డి, సంజీవ రెడ్డి, అనంగాళ్ల సంజీవ, సురేష్, పగిల్ల కొండయ్య, మంత్రి యాదయ్య, మన్నే మహేందర్, మాసిన కిష్టయ్య, సిద్ధిపేట వెంకట్ రెడ్డి, బోయిని యాదయ్య, పంతంగి గణేష్, మీసాల సంజీవ, రంగా మల్లేష్, పాటి రంగారెడ్డి, శ్రీపతి సంజీవ, సోమ కోటిరెడ్డి తదితరులు ఉన్నారు.
