ప్రజా సేవ పరమావధి అభివృద్ధి చేయడం నా అభిమతం

ప్రజా సేవ పరమావధి అభివృద్ధి చేయడం నా అభిమతం
- 15వ వార్డు కాంగ్రెస్ కోళ్ళ సంధ్య వెంకటేష్
మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మా కుటుంబానికి ప్రజాసేవ పరమావధి అభివృద్ధి మా అభిమతం మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను ఆదరించి ఆశీర్వదించి మున్సిపల్ కౌన్సిలర్‌గా భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోళ్ళ సంధ్య వెంకటేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.గురువారం తన మద్దతు దారులతో కలిసి వార్డు పరిధిలో జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఎన్నికల్లో తనను ఎందుకు గెలిపించాలి తాను గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తాను అనే అంశాలను ఓటర్లకు వివరించి మద్దతు కోరారు .ఈ సందర్భంగా కోళ్ళ సంధ్య వెంకటేష్ మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మన ప్రాంత అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో 15వ వార్డులో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి మక్తల్ లోనే ఆదర్శ వార్డుగా 15వ వార్డును తీర్చిదిద్దుతానని అన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో వెనుకబడ్డ 15వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. మీ అందరి సహకారంతో వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి 15వ వార్డు కౌన్సిలర్ గా తనను గెలిపించాలని కోళ్ళ సంధ్య వెంకటేష్ విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో మద్దతు దారులు పాల్గొన్నారు.
