Makthal | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీహరి

Makthal | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీహరి
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : వివిధ అభివృద్ధి పనుల భూమిపూజ నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిసెంబర్ 1వ తేదీన నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన సభాస్థలి ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Minister Dr.Vakiti Srihari) పరిశీలించారు. డిసెంబర్ 1న రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేయనున్నారు. అదేవిధంగా రూ.80కోట్ల వ్యయంతో మక్తల్ నుండి జిల్లా కేంద్రం నారాయణపేట ( Narayanpet) వరకు నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి అదేవిధంగా మక్తల్, నారాయణ పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేసి పనులు ప్రారంభించనున్నారు.

అనంతరం పట్టణంలోని ఐలిన్ స్కూల్ ప్రాంగణం వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ ఏర్పాటు కోసం ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఐలిన్ స్కూల్ వద్ద సమావేశ స్థలం వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించి.. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. మంత్రి వెంబడి కాంగ్రెస్ నాయకులు బి.గణేష్ కుమార్, గడ్డం రమేష్, మేదరి శ్రీనివాసులు, ఫయాజ్, వల్లంపల్లి లక్ష్మణ్, గోవర్ధన్, కావాలి ఆంజనేయులు, తహశీల్దార్ సతీష్ కుమార్, ఎస్సై 2 ఆచారి, తదితరులు ఉన్నారు.

