Makthal | 21న మక్తల్ లో షూటింగ్ బాల్ ఎంపికలు

Makthal | 21న మక్తల్ లో షూటింగ్ బాల్ ఎంపికలు
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 21న ఆదివారం ఉదయం 10 గంటలకు మక్తల్ పట్టణంలోని సాయిజ్యోతి ఉన్నత పాఠశాల (School) సంగంబండ రోడ్డు యందు నారాయణపేట జిల్లా, మహబూబ్నగర్ జిల్లా సీనియర్ మహిళల, పురుషుల షూటింగ్ బాల్ జట్లను ఎంపిక చేయడం జరుగుతుందని షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సత్య ఆంజనేయులు తెలిపారు.
ఇవాళ మక్తల్ (Makthal) లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… క్రీడల్లో ఆసక్తిగల రెండు జిల్లాల ( నారాయణపేట, మహబూబ్నగర్ ) బాలురు, బాలికలు, పురుషులు, మహిళలు ఆధార్ కార్డ్, బోనో ఫైడ్, క్రీడా దుస్తులు ధరించి హాజరు కావాలని తెలిపారు. జిల్లా స్థాయిలో క్రీడా నైపుణ్యతను ప్రదర్శించిన క్రీడాకారులను క్రీడాకారులు ఎంపిక చేసి ఈనెల 24 నుండి 26 వరకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం, అన్నారం షరీఫ్ గ్రామంలో జరుగనున్య రాష్ట్రస్థాయి సీనియర్ షూటింగ్ బాల్ పోటీలకు పంపుతామని ఆయన తెలిపారు.
రెండు జిల్లాల సీనియర్ షూటింగ్ బాల్ పోటీలను రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.గోపాలం (B. Gopalam) ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా షూటింగ్ బాల అసోసియేషన్ అధ్యక్షుడు ఆడమ్స్, ప్రధాన కార్యదర్శి బి.పుష్ప పి ఈ టి, కోశాధికారి రవి పిఈటి పాల్గొంటారని సత్వ ఆంజనేయులు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో బిషగోపాలం రమేష్ పాల్గొన్నారు.
