ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక..

99 రోజుల ప్రగతి పాలనలో ప్రణాళికలో భాగంగా మురుగు కాలువల శుభ్రం చేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ మానస హన్మంతు
పట్టణ ప్రగతి పై కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్

మక్తల్ , ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హన్మంతు ఇవాళ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రణాళిక కార్యక్రమాల ద్వారా చేపట్టాల్సిన పనులను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 99 రోజుల ప్రణాళిక ద్వారా పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొని ఆయా వార్డుల్లో అవసరమైన పనులను ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పట్టణ ప్రణాళికలో రూపొందించిన పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రతి ప్రాంతంలోనూ అవసరమైన పనులను ప్రాధాన్య క్రమంలో ప్రణాళికలు రూపొందించేందుకు మున్సిపల్ కౌన్సిలర్లు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

అందరం కలిసి పట్టణ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంద న్నారు .స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నందున అందరూ కలిసి ఎలాంటి సమస్యలు లేకుండా ఒకే మాటతో అవసరమైన పనులకు సిద్ధం చేస్తే నిధులు త్వరగా వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై అభివృద్ధికి సహకరించవలసిందిగా మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హన్మంతు విజ్ఞప్తి చేశారు.పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీరాములు, మున్సిపల్ మేనేజర్ ఖాదర్, మున్సిపల్ నాగశివ, మున్సిపల్ కౌన్సిలర్లు సరిత గోవింద్ రావు ,శ్రీవిద్య నీలా గౌడ్ ,కర్రెం చెన్నమ్మ నీలప్ప ,వెంకటేశ్వర్లు,అనిత ,కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి, జి.నీలప్ప ,నీలా గౌడ్ ,గోవర్థన్, గోవింద్ రావు ,సిబ్బంది, మెప్మా ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply