Makthal | బీఫారాలు అందజేత‌…

Makthal | బీఫారాలు అందజేత‌…

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో నామినేషన్ ల ఉపసంహరణ, బీఫారాల అందజేత సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులు 16 వార్డులకు గాను 16 మంది అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీఫారాలు అందజేశారు.16 మంది అభ్యర్థులు ఒక్కొక్కరుగా వెళ్లి వారి వారి ఎన్నికల అధికారికి బీఫారలను అందించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి జి. లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, కోళ్ళ వెంకటేష్, బి .గణేష్ కుమార్ మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించడం వల్లే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీల వల్ల ఎలాంటి ఫలితం ఉండదని ప్రలోభాలకు గురికాకుండా అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ లో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో సిసి రోడ్లు డ్రైనేజీలు తాగునీటి పైప్లైన్లు వేస్తున్నామని అన్నారు. మరింత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కట్ట వెంకటేష్, పుల్లంపల్లి లక్ష్మణ్, వాకిటి హనుమంతు, బోయ వెంకటేష్, రహీం పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply