Telangana | దొంగనోట్ల తయారీ కలకలం

Telangana | దొంగనోట్ల తయారీ కలకలం

హైదరాబాద్ లో పట్టుబడిన ముఠాతో గుట్టు రట్టు
అసలు నిందితుడి మకాం తాండూరులోనే


Telangana | తాండూరు, ఆంధ్రప్రభ : తాండూరు కేంద్రంగా దొంగ నోట్ల తయారీ (fake currency notes) జరుగుతోందని కలకలం రేగింది. హైదరాబాద్ లోని మెహదీపట్నం పోలీసులు ఓ ముఠాను పట్టుకోవడంతో ఈ సంఘటన చర్చనీయాంశమైంది. హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు ప్రకటించిన విడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అందులోని కథనం మేరకు కోస్గి మండలం గుండిమల్ గ్రామానికి చెందిన కస్తూరి రమేష్ బాబు, అతని సోదరి రామేశ్వరి తాండూరు పట్టణంలో కోకట్ మార్గంలోని ఓ భవనంలో ఉంటూ దొంగనోట్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

రమేష్ బాబు (Ramesh Babu) దొంగనోట్ల కోసం ఇన్ స్టాగ్రాం పోస్టులో పెట్టిన నెంబర్ ఆధారంగా హైదరాబాద్ కు చెందిన వాహిద్, తహాన్, ఇమ్రాన్, ఓమర్ మరికొందరు ముఠా ద్వారా రమేష్ బాబు రూ.500 దొంగనోట్ల చలామణి చేస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. దీంతో వారిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి 950 నకిలీ నోట్లు అంటే సుమారు 4లక్షల 75 వేలు స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

నిందితుడు తాండూరు (Tandoor) లోనే ఉంటూ దొంగనోట్ల చలామణి చేసినట్లు వివరించారు. 500నోట్లను స్కాన్ చేసి.. జేకే బాండ్ పేపర్లో ప్రింట్ తీసి.. గ్రీన్ కలర్ గిఫ్ట్ ప్యాక్ కవర్ను కత్తరించి.. పెవికాల్తో అసలుకు మించిన నకిలీ నోట్లను తయారు చేశారని వివరించారు. తాండూరు కేంద్రంగా దొంగ నోట్ల తయారి జరుగుతోందని సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో స్థానికంగా దొంగనోట్ల కలకలం రేగింది. రెండేళ్ల క్రితం అంటే 2024 జులైలో కూడా దొంగనోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో తాండూరులోనే రూ.7లక్షల 95 వేల విలువైన నకిలీ నోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కుంబకోణంలో చంద్రయ్య, జగదీష్ అనే నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Leave a Reply