క‌ల్లుగీత కార్మికులూ.. విజ‌య‌వంతం చేయండి

క‌ల్లుగీత కార్మికులూ.. విజ‌య‌వంతం చేయండి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : జిల్లా కల్లుగీత కార్మిక సంఘం మ‌హాస‌భ‌లు ఈ నెల 16న సంగారెడ్డి నిర్వ‌హిస్తామ‌ని జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ (Ramesh Goud) తెలిపారు. ఈ రోజు సంగారెడ్డిలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని సంఘం అధ్యక్షుడు ఆశన్నగౌడ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలను విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. మాహాసభలకు రాష్ట్ర నాయకులు, గౌడ ప్రజా ప్రతినిధులు, మేధావులు హాజరవుతున్నారన్నారు. ఈ మహాసభల్లో కల్లుగీత వృత్తి రక్షణ కోసం కార్మికుల ఉపాధి కోసం గౌడ కులస్తుల సంక్షేమం కోసం తీసుకోవలసిన అనేక అంశాలపై చర్చిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు ఇచ్చిన హామీల అమలు కోసం భవిష్యత్తు ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తామన్నారు.

ఇంటికో మనిషి.. ఊరుకో బండితో సంగారెడ్డికి రావాలని పిలుపునిచ్చారు. ఈ స‌భ‌ల‌కు కల్లుగీత కార్మికుల సొసైటీల అధ్యక్షులు, టీఎఫ్టీ సభ్యులు పాల్గొని విజ‌య‌వంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు అంజాగౌడ్ జిల్లా కమిటీ సభ్యులు, శ్రీనివాస్ గౌడ్ కృష్ణగౌడ్, రామాగౌడ్, భూమాగౌడ్ యాదగౌడ్, వెంకటేశంగౌడ్, సత్యనారాయణగౌడ్, చేన్నగౌడ్, నవీన్ గౌడ్, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply