మ‌నిగ‌ళ్ల‌లో శివ యాదవ్ ను గెలిపించండి

మ‌నిగ‌ళ్ల‌లో శివ యాదవ్ ను గెలిపించండి

పెద్దమందడి, ఆంధ్ర‌ప్ర‌భ : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బ‌ల‌ప‌ర్చిన పెద్దమందడి మండలం మ‌నిగ‌ళ్ల స‌ర్పంచ్ అభ్య‌ర్థి శివ యాద్‌ను గెలిపించాల‌ని వ‌న‌ప‌ర్తి మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ బి.శ్రీ‌నివాస్ గౌడ్ అన్నారు. ఈ రోజు శివ యాదవుకు మ‌ద్ద‌తుగా గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌నివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న గ్రామ‌స్థుల‌కు వివ‌రిస్తున్నారు. గతంలో మ‌నిగ‌ళ్ల‌ గ్రామాన్ని మాజీ సర్పంచ్ సరితా తిరుపతయ్య ద్వారా అభివృద్ధి చేశామ‌ని గుర్తు చేశారు.

ఈ సారి పోటీ చేస్తున్న శివ యాదవ్ ను అత్య‌ధిక మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో గ్రామాన్ని మ‌రింత అభివృద్ధి చేస్తామ‌న్నారు.

శివ యాద‌వ్‌కు మ‌ద్ద‌తుగా మాజీ కౌన్సిలర్లు బ్రహ్మచారి, మధు గౌడ్, ప్రజా వైద్యులు పగిడాల శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ సరితా తిరుపతయ్య, మ‌నిగ‌ళ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ కొండ రవీందర్ రెడ్డి, మద్దిలేటి మాజీ ఎంపిటిసి నరసింహారెడ్డి, డాక్టర్ పగిడాల శ్రీనివాస్, బాలరాజ్ , కొమ్ము సురేష్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply