సులభతరం చేయండి

అధికారుల‌కు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

శ్రీకాకుళం, నవంబర్, ఆంధ్రప్రభ బ్యూరో : కార్తీకమాసం పర్వదినం మూడో సోమవారం సందర్భంగా జిల్లాలోని వివిధ శైవక్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో, భక్తుల రద్దీకి తగ్గట్లు సమగ్ర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగంలోని కీలక అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన దేవాలయాలైన శ్రీముఖలింగం, ఉమా రుద్ర కోటేశ్వరాలయం, శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీకూర్మం, అరసవల్లి వంటి ప్రముఖ శైవ, వైష్ణవ క్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, క్యూలైన్లు, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు, చిన్నపిల్లలతో వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

భద్రత, రవాణా, ఆరోగ్య సేవలు, శానిటేషన్ వంటి అంశాల్లో పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, దేవాదాయ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసి నిర్విరామంగా పనిచేయాలని సూచించారు. గత సంవత్సరాల అనుభవాలను పరిగణలోకి తీసుకొని, ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలగకుండా మరింత మెరుగైన భద్రత, సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply