majority | కాంగ్రెస్ మద్దతు దారులు గెలిస్తేనే గ్రామాల అభివృద్ధి….

majority | కాంగ్రెస్ మద్దతు దారులు గెలిస్తేనే గ్రామాల అభివృద్ధి….

  • పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి….

majority | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపిస్తేనే గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి(Baddam Indrakaran Reddy) అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు.

ప్రతి గ్రామం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ తో పాటు సభ్యులను గెలిపించాలని ఆయన సూచించారు. ప్రతి నిరుపేద కుటుంబానికి(family) ప్రభుత్వం అండగా నిలుస్తుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళకు నాణ్యమైన చీరలు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి గ్రామం అన్ని రంగాలలో ఆదర్శంగా నిలవాలంటే కాంగ్రెస్ మద్దతుదారులను భారీ మెజార్టీ(majority)తో గెలిపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పూనూరు దయాకర్ రెడ్డి, పెద్ద బచ్చ గారి శ్రీనివాసరెడ్డి, డీలర్ శ్రీనివాస్ ఉన్నారు.

Leave a Reply