బీఆర్ఎస్ తోనే పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి….

బీఆర్ఎస్ తోనే పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి….

  • బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి..
  • విశ్రాంత ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పరకాల, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ తోనే పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, విశ్రాంత ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ రోజు పట్టణంలోని మాదారం పోచమ్మ గుడి వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా నాయకుల వెంట బీఆర్ఎస్ పార్టీ 7వ వార్డు అభ్యర్థి దుంపేటి నాగరాజు, 9వ బండారి కృష్ణ కవిత, పదో వార్డు అభ్యర్థి పిట్ట స్వప్న దేవేందర్, 11వ వార్డు అభ్యర్థి మార్త విక్రమ్, 20 వార్డు అభ్యర్థి పాలకుర్తి గోపి ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేసీఆర్ పాలనలో పట్టణ, గ్రామాలు అభివృద్ధి జరిగిందని, బిఆర్ఎస్ పార్టీ ఆయాంలో నిర్మాణం చేసిన బిల్డింగ్లకు కలర్స్ వేసి తాము చేసినట్లు చెప్పుకుంటున్నారని ధర్మారెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధికి దోహదం చేసినట్లు ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply