కర్నూలు, అనంతపురం రేంజ్లో ఇన్స్పెక్టర్ల భారీ బదిలీలు

కర్నూలు, అనంతపురం రేంజ్లో ఇన్స్పెక్టర్ల భారీ బదిలీలు
- 18 మంది అధికారులకు కొత్త బాధ్యతలు
- పరిపాలనా కారణాలతో ఉత్తర్వులు జారీ
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ ; కర్నూలు–అనంతపురం పోలీస్ రేంజ్ పరిధిలో సివిల్ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్లపై భారీ స్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. కర్నూలు రేంజ్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫారసుల మేరకు మొత్తం 18 మంది ఇన్స్పెక్టర్లను పరిపాలనా కారణాల దృష్ట్యా తక్షణ ప్రభావంతో బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో భాగంగా వీఆర్‌లో ఉన్న ఎం. దస్తగిరి బాబును మంత్రాలయం సర్కిల్‌కు నియమించగా, అక్కడ పనిచేస్తున్న పి. రామాంజులను పులివెందుల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పులివెందుల ట్రాఫిక్ పీఎస్‌లో ఉన్న కె. సంతిలాల్ను పులివెందుల రూరల్ సర్కిల్‌కు మార్చారు.
అలాగే పులివెందుల రూరల్ సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న వి. సీతారామి రెడ్డిని నంద్యాల జిల్లా డీటీసీకి, అక్కడ పనిచేస్తున్న డి. హాజీ వాలిని వైఎస్ఆర్ కడప జిల్లా సీసీఎస్-IIకి బదిలీ చేశారు. అన్నమయ్య జిల్లాలో ఎస్సీ,ఎస్టీ సెల్లో ఉన్న కొట్టం దస్తగిరిని మొలకలచెరువు యూపీఎస్‌కు నియమించగా, అక్కడి సి. వెంకటేసులను వీఆర్‌కు పంపించారు. కర్నూలు జిల్లా వీఆర్‌లో ఉన్న ఏ. గంగాధర్, కె. ఉలసయ్యలను అనంతపురం వీఆర్‌కు బదిలీ చేశారు. అనంతపురం వీఆర్‌లో ఉన్న ఎస్కె. చంద్ బాషాను చెన్నూరు యూపీఎస్‌కు పంపగా, అక్కడ పనిచేస్తున్న ఎం. కృష్ణ రెడ్డిని అన్నమయ్య జిల్లా ఎస్సీ,ఎస్టీ సెల్‌కు మార్చారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో సీసీఎస్-IIలో ఉన్న వి. శ్రీహరిని వొంటిమిట్ట సర్కిల్‌కు, అక్కడి పి. నరసింహ రాజును కడప తాలూకా యూపీఎస్‌కు బదిలీ చేశారు. కడప తాలూకా యూపీఎస్‌లో ఉన్న టి. రెడ్డప్పను వీఆర్‌కు పంపించారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు యూపీఎస్‌లో ఉన్న జి. మారుతి శంకర్‌ను కర్నూలు I టౌన్ యూపీఎస్‌కు నియమించగా, అక్కడి ఎం. పార్థసాధిని ఫాక్షన్ జోన్‌కు మార్చారు. ఫాక్షన్ జోన్లో పనిచేస్తున్న ఎం. శ్రీధర్‌ను కర్నూలు టుటౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
కర్నూలు టుటౌన్ పీఎస్‌లో ఉన్న జి.వి. నాగరాజరావును నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ యూపీఎస్‌కు నియమించారు. ఎం. యుగంధర్‌ను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ యూపీఎస్ నుండి కర్నూలు జిల్లా కౌతాళం యూపీఎస్‌కు బదిలీ చేశారు. ఎన్. అశోక్ కుమార్‌ను కర్నూలు జిల్లా కౌతాళం యూపీఎస్ నుంచి నంద్యాల జిల్లా నందికొట్కూరు యూపీఎస్‌కు మార్చారు. వై. ప్రవీణ్ కుమార్ రెడ్డిని నంద్యాల జిల్లా నందికొట్కూరు యూపీఎస్ నుంచి కర్నూలులోని సోషల్ మీడియా & సైబర్ క్రైమ్ సెల్‌కు నియమించారు. అదేవిధంగా, డి. మస్తాన్ వలీని సోషల్ మీడియా & సైబర్ క్రైమ్ సెల్ నుంచి కర్నూలు జిల్లా సీసీఎస్-2కి బదిలీ చేశారు.
కె. శ్రీనివాస నాయక్‌ను సీసీఎస్-2 నుండి కర్నూలు జిల్లా ఆస్పరి యూపీఎస్‌కు పంపించారు. ఎన్. కృష్ణయ్యను వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ రూరల్ సర్కిల్ నుంచి అదే జిల్లాలోని టి. సుందుపల్లి సర్కిల్‌కు మార్చగా, ఏ.పి. మస్తాన్‌ను టి. సుందుపల్లి సర్కిల్ నుంచి బద్వేల్ రూరల్ సర్కిల్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీలు పోలీస్ శాఖలో పరిపాలనా సౌలభ్యం, సేవల మెరుగుదల లక్ష్యంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు త్వరలోనే తమ తమ స్థానాల్లో విధుల్లో చేరనున్నట్లు సమాచారం.
