mahotsavam | సంస్కృతి ప్ర‌తిబింబించేలా…

mahotsavam | సంస్కృతి ప్ర‌తిబింబించేలా…

  • వైభవంగా రంగుల మహోత్సవం

mahotsavam | పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ఎన్‌టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు, దేవతా పరివారులతో నిర్వహిస్తున్న రంగుల మహోత్సవం భక్తజన సందోహంతో అంగరంగ వైభవంగా నిర్వ‌హించారు. ఈ అమ్మవారి రంగుల మహోత్సవ కార్యక్రమం సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా నృత్య విన్యాసాలు, మేళతాళాల నడుమ, నీరు పారబోసే శాస్త్రోక్త విధానాలతో కనుల పండుగగా జరుగుతున్న పవిత్రోత్సవంలో మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రత్యేకంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు.

ఈ సందర్భంగా నెట్టెం శ్రీ రఘురాం అమ్మవారి దేవతా మూర్తిని స్వయంగా తలపై ధరించి భక్తులతో కలిసి ఊరేగింపుగా ప్రదక్షిణ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావోద్వేగాల మధ్య సాగుతున్న ఈ ఊరేగింపు కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సమృద్ధిగా ఉండాలని నెట్టెం శ్రీ రఘురాం ప్రార్థించారు.

mahotsavam

ఈ మహోత్సవానికి ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో మహేశ్వర్ రెడ్డి, పెనుగంచిప్రోలు ఆలయ మాజీ చైర్మన్ నూతలపాటి కేశవ, ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్, వెగినేటి గోపాలకృష్ణమూర్తి, దివెళ్ల వంశీ కృష్ణ, కోట ఝాన్సన్, ఖంబం చిరంజీవి, కాట్రగడ్డ మధు, నలమోలు శివరామ ప్రసాద్, నూతలపాటి వెంకటేష్, కొతపల్లి సతీష్ పాటు ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేస్తూ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి రంగుల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం, భక్తి, సంస్కృతి సమ్మేళనంగా కొనసాగుతున్న ఈ వేడుకలు పెనుగంచిప్రోలు పట్టణంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి.

Leave a Reply