మ‌హేశ్‌కుమార్ గౌడ్ ప‌రామ‌ర్శ‌

వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ (Allu Aravind) కుటుంబాన్ని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పరామర్శించారు. ఈ రోజు జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి వెళ్లి కలిశారు. ఇటీవల‌ ప్రఖ్యాత హాస్యనటుడు, పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah) సతీమణి అల్లు కనకరత్నమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆమె కుమారుడు అల్లు అర‌వింద్‌, మ‌న‌వ‌డు ప్ర‌ముఖ న‌టుడు అల్లు అర్జున్‌(Allu Arjun) ల‌తో మాట్లాడారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన దేవుడిని ప్రార్థించారు. ఈ దుఃఖ సమయంలో వారికి తోడుగా నిలవాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

Leave a Reply