మహేందర్ ముందస్తు అరెస్ట్..

మహేందర్ ముందస్తు అరెస్ట్..
వికారాబాద్, ఆంధ్రప్రభ : రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘం నేతృతంలో గురువారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్న కారణంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఐకేఎంఎస్ నాయకులు వై మహేందర్ ను వికారాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. శివరాం నగర్ లో నివాసముండే మహేందర్ గృహానికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీతా మహేందర్ మాట్లాడుతూ.. పోలీసులు ఎటువంటి సమాచారం లేకుండా తెల్లవారుజాము ముందే అదుపులోకి తీసుకోవడం సమంజసం కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ రాజ్యం నడుస్తుందని ఆమె ఆరోపించారు.
