ముంబయి: మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా చేశారు. సర్పంచ్ సంతోష్ దేశముఖ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్ ముండేను సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో ధనంజయ్ ఇవాళ రాజీనామా చేశారు. ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
Maharashtra | మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా..!
