MahaKumbamela – త్రివేణి సంగంలో మోడీ పుణ్య స్నానం … గంగకు ప్రత్యేక పూజలు
ప్రయోగ్ రాజ్ – ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ జరుగుతున్న విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని గంగా, యమునా, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్బంగా నేడు ప్రధాని మోదీ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం ఘాటు వద్ద ఆయన పుణ్య స్నానమాచరించారు.. గంగమ్మ కు ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
ముందుగా ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బమ్రౌలి విమానాశ్రయానికి చేరుకున్నారు.. అక్కడ నుంచి ఆయన కారులో కుంభమేళాకు చేరుకున్నారు. అనంతరం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్య నాథ్ లో కలసి పడవలో అరయిల్ ఘాట్ నుండి త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆయన పుణ్య స్నానమాచరించారు. అనంతరం ఆయన అఖారాలు, ఆచార్యవాడ, దండివాడ, ఖాక్‌చౌక్ ప్రతినిధులను కలిశారు.. వారితో కొత్త సేపు మాట్లాడారు.. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు..