ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణపతి (Khairatabad Ganesh) గంగమ్మ ఒడిలోకి చేరనుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో ప్రారంభమైన గణనాథులు హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) వద్దకు చేరుకుంటున్నాయి. క్రేన్-4 వద్దకు ఖైరతాబాద్ మహా గణపతి ప్రతిమ చేరుకుంది. సరిగ్గా ఒంటి గంటకు నిమజ్జనం పూర్తేయ్యాలా అటు నిర్వహకులు, ఇటు అధికారులు చర్యలు చేపట్టారు.
ముగిసిన శోభయాత్ర..
హైదరాబాద్ (Hyderabad) గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేకత చాటుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర ముగిసింది. రాజ్ దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం మీదుగా క్రేన్ నంబర్ 4 కు చేరుకుంది. బడా గణపతి మహా శోభయాత్ర (Shobha Yatra) సందర్భంగా ట్యాంక్ బండ్ చుట్టుపక్కల జనం కిక్కిరిసిపోయారు. మరోవైపు హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన 30 క్రేన్ల వద్ద వినాయకుల నిమజ్జనం (Nimajjanam) అవిరామంగా జరుగుతోంది. దాదాపు ముప్పై వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు కొనసాగుతోంది.