mahaboobnagar | కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామ రూపురేఖలు మారుస్తా

mahaboobnagar | కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామ రూపురేఖలు మారుస్తా
mahaboobnagar | ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ నిధులతోపాటు ఎంపీడీకే అరుణ సహకారంతో విరివిగా నిధులు తీసుకువచ్చి పెద్ద జట్రం గ్రామ రూపురేఖలు మారుస్తానని సర్పంచ్ వాకిటి వెంకటేష్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం సర్పంచుగా అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి నిబద్ధతతో పనిచేస్తుండడం గతంలో చేసిన సేవలు గుర్తించిన ప్రజలు తమను ఆదరించారని అన్నారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లో(politics)కిపార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు మంజూరు చేయడంతో పాటు ఎంపీడీకే అరుణ సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా గ్రామం అభివృద్ధి(development)కి నోచుకోలేదని కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అభివృద్ధికి నిధులు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు.
నీతి నిజాయితీతో కూడిన పారదర్శకమైన పాలన అందించడమే తన లక్ష్యమన్నారు. ప్రతి వాడలో డ్రైనేజీ సిసి రోడ్లు వేయడంతోపాటు విద్య వైద్య రంగాలకు ప్రత్యేక కృషి చేస్తానన్నారు. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య నియోజకవర్గ నాయకులు సోమశేఖర్ గౌడ్ సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి,వార్డు సభ్యులు నాయకులు కిరణ్ కుమార్, గంగాధర్ రెడ్డి, సోమేశ్వర్ రెడ్డి, కుర్వ బండప్ప, శంకరప్ప అంజప్ప తదితరులు పాల్గొన్నారు.
