Maha Dharna | ప్రాణాలు తీస్తారా..?
గన్నేరువరం, ఆంధ్రప్రభ : డబుల్ రోడ్డు కోసం ఈనెల 16న గుండ్లపల్లి రాజీవ్ రహదారి పై యువజన సంఘాల (Yuvajanala Samgalu) ఆధ్వర్యంలో చేపట్టబోయే మహాధర్న (Maha Dharna) విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం గన్నేరువరం మండల కేంద్రంలో నిరసన చేపట్టి డబుల్ రోడ్డు కోసం మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. రోడ్డు వేస్తారా..? ప్రాణాలు తీస్తారా..? అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుండ్లపల్లి నుండి పోత్తూరు వరకు 71 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరై మూడేళ్లు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తి కాలేదు. అందుకనే కాంట్రాక్టర్ కంకర పోసి వదిలేయడంతో ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నా.. అధికారులు నాయకులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ రోడ్డు వేసేంత వరకు తమ పోరాటం ఆగదని యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు.

