Magistrate’s Court | నిందితుడికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష

Magistrate’s Court | నిందితుడికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష
- రూ.15 వేల జరిమానా విధింపు
Magistrate’s Court | చిట్టినగర్, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 సంవత్సరం లో జరిగిన సంఘటన సంబంధించిన తుది తీర్పు బుధవారం నాడు వెలువడింది. అంబాపురం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ జీవరత్నం (76) పై భూ వివాదం కారణంగా వెదురు కర్రతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి అని 2019 అక్టోబర్ 10న టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు .
దానికి సంబంధించి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 326, 506 కింద కేసు నమోదు చేశారు. అతనికి తీవ్ర గాయాల అయ్యాయి అన్న కేసు లో నేరం రుజువవడంతో నిందితుడుకు 4 ఏళ్ళు కఠిన కారాగార శిక్షతో పాటు 15 వేల రూపాయలు జరిమానా విధిస్తు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పు వెలువరించారు. పాత భూవివాదం నేపథ్యంలో బాధితుడి పై వెదురు కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ఆరు మంది సాక్షులను విచారించారని దాంతో నిందితుడి తప్పిదనం రుజువై శిక్ష ఖరారైంది అని పోలీసులు తెలిపారు.
