Maganti Sunitha | ప్రజలను భయపెట్టి…
- నైతిక విజయం మాదే..
Maganti Sunitha | హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్, రౌడీయిజం గెలిచిందని, ఆడబిడ్డపై కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారని అన్నారు. తన భర్త మాగంటి గోపీనాథ్ (Gopinath) ఉన్నప్పుడు, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ల ఆటలు సాగలేదని అన్నారు.
కాంగ్రెస్‌ది గెలుపే కాదని.. నైతిక విజయం తనది, బీఆర్‌ఎస్‌దే అని ఆమె స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.

