షేక్ పేటలో.. మాగంటి సునీత

- ఓడిస్తేనే.. 6 గ్యారంటీలు అమలు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం నియోజకవర్గ పరిధిలోని షేక్ పేట డివిజన్ అంబేద్కర్ నగర్, బాలాజీ నగర్ కాలనీలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషాతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ నెలలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే.. 6 గ్యారంటీలు 420 హామీలు అమలు అవుతాయనీ, ఉప ఎన్నికల్లో మాగంటి సునీతని గెలిపించుకునే బాధ్యత మనందరిదనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
