Madyapradesh – కారు – ట్ర‌క్కు ఢీ …8మంది దుర్మ‌ర‌ణం

13 మందికి గాయాలు
మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని సిద్ది జిల్లాల‌లో ఘ‌ట‌న

బోపాల్ – మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో నేడు జ‌రిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా మరో 13మంది గాయపడ్డారు. ఈ సోమవారం తెల్లవారుజామున అతి వేగంగా వెళ్తున్న కారు, ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిద్ధి-బహ్రీ రోడ్డులోని ఉపని గ్రామం సమీపంలోని పెట్రోల్ పంపు సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా ఈ ప్రమాదంపై డీఎస్పీ గాయత్రి తివారీ మాట్లాడుతూ.. నిన్న రాత్రి సిద్ధిలో కారు ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఉట్ని పెట్రోల్ పంప్ సమీపంలో బల్కర్, కారు మధ్య జరిగిన ప్రమాదం గురించి త‌మ‌కు సమాచారం అందిందని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పరిస్థితి భయానకంగా ఉందని చెప్పారు. సంఘటనా స్థలం పూర్తిగా రక్తసిక్తంగా మారింది. దాదాపు 13 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది మరణించారని వివరించారు.. బల్కర్ సిద్ధి నుండి బహ్రీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *