Madhapur | బోర్డు తిప్పిన మ‌రో ఐటీ కంపెనీ

Madhapur | బోర్డు తిప్పిన మ‌రో ఐటీ కంపెనీ

400 మంది బ‌లి!


Madhapur | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మాదాపూర్ లో మరో ఐటీ కంపెనీ (IT Company) బోర్డు తిప్పేసింది. నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని ఐటీ కన్సల్టెన్సీ, శిక్ష‌ణ పేరుతో ఐటీ కంపెనీలు నిరుద్యోగులకు కుచ్చుటోపి వేస్తున్నాయి. ఉద్యోగం కోసం వచ్చినవారు దిక్కుతోచని పరిస్థితిలో వేరే దారి లేక లక్షల్లో చెల్లించి మోసపోతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏడాదికి పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. తాజాగా ఓ ఐటీ కంపెనీ ఉద్యోగం కోసం వచ్చిన వద్ద లక్షల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసింది. మాదాపూర్ (Madhapur) లో బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 400 మంది..

మాదాపూర్ (Madhapur) లో మరో ఐటీ కంపెనీ ఎన్ఎస్ఎన్ (NSN) బోర్డు తిప్పేసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో కలకలం రేపుతోంది. శిక్షణ, ఉద్యోగ అవకాశం పేరుతో 400 మందికి పైగా నిరుద్యోగుల దగ్గర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఐటీ కంపెనీ అని నమ్మించి, ఉద్యోగం ఖాయం అని మాటలు చెప్పి భారీగా డబ్బులు తీసుకున్నారని స‌మాచారం.

కంపెనీ యజమాని స్వామి నాయుడు (Swamy Naidu) ఈ మొత్తం మోసానికి కార‌కుడు అని పోలీసులు గుర్తించారు. తాను ప్రైవేట్ ఛానల్ యజమాని అని చెప్పుకుని, నకిలీ ప్రతిష్టను సృష్టించి యువతను నమ్మించి టోకరా వేసినట్టు బాధితులు తెలిపారు. ప్రస్తుతం స్వామి నాయుడు పరారీలో ఉండగా, మోసపోయిన వారు సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad Commissionerate) లోని ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ వద్ద ఫిర్యాదులు చేశారు. కంపెనీ ఆఫీసు ముందుకెళ్లిన బాధితులకు బోర్డు తిప్పేయబడిన ఖాళీ కార్యాలయం మాత్రమే కనిపించడంతో మోసం విషయం స్పష్టమైంది.

Leave a Reply