Madaram | వన దేవతల సన్నిధిలో కేంద్రమంత్రులు..

Madaram | వన దేవతల సన్నిధిలో కేంద్రమంత్రులు..
Madaram | మేడారం (మంగ పేట), ఆంధ్రప్రభ : కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, జువాల్ ఓరం ఈ రోజు మేడారంలోని వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. మేడారంకు విచ్చేసిన కేంద్రమంత్రులకి రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్, పూజారులు. అధికారులు కేంద్రమంత్రులకు ఘనస్వాగతం పలికారు.
వనదేవతలను దర్శించుకున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి 75కిలోలు, జువాల్ ఓరం 86 కిలోలు తులాభారం వేసుకొని అమ్మవార్లకు తమ ఎత్తు బంగారం మొక్కు చెల్లించుకున్నారు. మేడారం విచ్చేసిన కేంద్రమంత్రులకు రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లు మెమోంటోలు
అందజేశారు.

మేడారం అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తుంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మేడారం జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కెటాయించిందని, జాతర అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం మేడారంలో కేంద్రమంత్రి జువాల్ ఓరంతో కలిసి వనదేవతలను దర్శించుకున్న అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో రామప్పకు మొట్టమొదటి యునెస్కో గుర్తింపు వచ్చేలా మోడీ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మేధారంలో నూతన కట్టడాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం తరపున అభినందిస్తున్నామని అన్నారు. ఈప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ వస్తే గిరిజన యువత అభివృద్ధికి మరింత దోహదపడుతుందని అన్నారు.
CLICK HERE TO READ MORE : Sammakka Sarakka | మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్..
