Madaram | జోరందుకున్న స్థానిక ఎన్నికల ప్రచారం
- ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
- మేడారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి పీరీల భారతి – వెంకన్న
Madaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ : మండలంలోని మేడారం గ్రామ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పీరిల భారతి – వెంకన్న కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మేడారం(Madaram) గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థి పీర్ల భారతి – వెంకన్న ప్రజలు ఎక్కడికెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు.
అధికార పార్టీ(ruling party)కి ఓటే ద్దాం , మేడారం గ్రామ అభివృద్ధికి బటేద్దాం అనే నినాదంతో ప్రజల ముందుకు వెళుతూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వార్డు అభ్యర్థి సభ్యులు, మహిళా నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.

