Maa Inti Bangaram | సామ్ లుక్ అదిరింది..

Maa Inti Bangaram | సామ్ లుక్ అదిరింది..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న కొత్త సినిమా మా ఇంటి బంగారం. ఈ చిత్రాన్ని తన ట్రలాలా పిక్చర్స్ బ్యానర్(Tralala Pictures banner) పై సమంత నిర్మిస్తోంది. శుభం సినిమా తర్వాత సమంత ప్రొడ్యూస్ చేస్తున్న రెండో చిత్రమిది. దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో(With a crime thriller story) రూపొందుతున్న మా ఇంటి బంగారం సినిమా టీజర్ అప్ డేట్ ఇచ్చింది మూవీ టీమ్. ఈ టీజర్ ను ఈ నెల 9న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టీజర్ అప్ డేట్(Teaser update) సందర్భంగా రిలీజ్ చేసిన సమంత పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఒక బస్సులో చీరకట్టులో నిలుచుని కోపంగా చూస్తున్న సమంత స్టిల్ ను మేకర్స్ రివీల్ చేశారు.
Maa Inti Bangaram | యాక్షన్ థ్రిల్లర్..

ఈ పోస్టర్ లో మీరు చూస్తా ఉండండి, మీ అందరితో కలిసిపోతుంది అని రాసిన క్యాప్షన్ ఆసక్తి(The written caption is interesting) కలిగిస్తోంది. 80వ దశకం నేపపథ్యంగా సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఓ కీ రోల్ చేస్తున్నారు. నందిని రెడ్డి, సమంత కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రమిది. వీళ్ల కాంబోలో వచ్చిన ఓ బేబీ సినిమా(Oh baby movie) మంచి విజయం సాధించింది. సక్సెస్ పరంగా నందిని రెడ్డి కూడా ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని భావిస్తోంది.
Maa Inti Bangaram | ఫ్యాన్స్.. వెయిటింగ్..

ఇక సమంత కెరీర్ గురించి చెప్పుకోవాలంటే.. కొన్నేళ్లు తెలుగు, తమిళ చిత్ర(Telugu and Tamil film) పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా వెలిగింది సమంత. ఆ తర్వాత హిందీలో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా ఫేమ్(Pan India Fame) తెచ్చుకుంది. పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలు బాగా తగ్గించింది సమంత. కొత్త హీరోయిన్స్ జోరులో ఆమె వెనకబడిందనే చెప్పాలి.

తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించి ఆ తర్వాత హిందీలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్(Citadel Honey Bunny Web Series in Hindi) చేసింది. అప్పటి నుంచి సమంత కొత్త ప్రాజెక్ట్ కోసం ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. శుభం సినిమాలో చిన్న రోల్ చేసిన సమంత ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్రంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్ లో కనిపించబోతోంది.
