అధ్యాయం 4, శ్లోకం 30
30
అపరే నియతాహారా:
ప్రాణాన్ ప్రాణషు జుహ్వతి |
సర్వే ప్యేతే యజ్ఞవిదో
యజ్ఞక్షపితకల్మషా:
తాత్పర్యము : యజ్ఞ ప్రయోజనమును తెలిసిన ఈ కర్తలందరును పాప ఫలముల నుండి శుద్ధిపడి, యజ్ఞఫలమనెడి అమృతమును ఆస్వాదించినందున నిత్యమైన భగవద్ధామము వైపునకు పురోగమింతురు.
భాష్యము : పైన వివరింపబడిన వివిధ యజ్ఞముల లక్ష్యము ఇంద్రియ నిగ్రహణయే. ఇంద్రియ భోగానందమే భౌతిక బంధనానికి కారణమగుచున్నది. కాబ ట్టి దానిని విడిచి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి రానంత వరకూ ఎవ్వరునూ జ్ఞాన పరిపూర్ణమైన, ఆనందమయ జీవితానికి నోచుకోరు. జీవితములో ఈ విధమైన పురోగతి చెందిన వారు ఈ జీవితములో ఆనందాన్ని, సంపదలను పొందుటయే కాక జీవితాంతమున శాశ్వతమైన భగవద్ధామాన్ని చేరి, బ్రహ్మ జ్యోతిలో లీనమగుట గానీ లేదా భగవంతుని సాన్నిధ్యాన్ని గానీ పొందుదురు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….