గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 39
39

ఆవృతం జ్ఞానమేతేన
జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కౌంతేయ
దుష్పూరేణానలేన చ ||

అర్థము : ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడును తృప్తి చెందనిదియు మరియు అగ్ని వలె దహించునదైన కామమనెడి నిత్య వైరిచే ఆవరింపబడును.

భాష్యము : ఇంధనముచే అగ్ని ఆర్పబడునట్లు, ఎంతటి బోగానుభవము చేతను కామము సంతృప్తి చెందదని మను స్మృతి యందు తెలుపబడినది. కారాగారము నందు నేరస్థులు బంధింపబడన ట్లు భగవానుని ఆజ్ఞలను ఉల్లంఘించినవారు మైధున భోగము ద్వారా బంధింపబడుదురు. కనుకనే ఈ జగము ” మైధునాగారము” అని పిలువబడును. ఇంద్రియ భోగమే లక్ష్యముగా కొనసాగే నాగరికత వలన మైధునాగారములో జీవుడి కాలమును పొడగించుటయే కాక మరియే ప్రయోజనము ఉండదు. ఇంద్రియ భోగము అనుభవించునప్పుడు సుఖ భావనము కొద్దిగా కలిగినను వాస్తవమును అట్టి నామ మాత్ర సుఖ భావనము ఇంద్రియ భోగికి నిత్య శత్రువై ఉన్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *