గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 19
19

తస్మాదసక్త: సతతం
కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్‌ కర్మ
పరమాప్నోతి పూరుష: ||

అర్థము : కనుక ప్రతి ఒక్కరూ కర్మ ఫలముల యందు ఆసక్తిని కలిగి యుండక, తన విధియని భావించుచూ కర్మలను నిర్వహించవలెను. అట్టి అనాసక్తితో కర్మను చేసినచో ‘పరము’ ను పొందగలుగుదురు.

భాష్యము : భక్తులకు ‘పరము’ భగవంతుడైతే, నిరాకారవాదులకు ‘పరము’ మోక్షము. కనుక భక్తుల ఆదేశముపై ఫలాసక్తి లేకుండా కృష్ణుని సేవ చేస్తున్నట్లయితే వారు పరమ లక్ష్యము వైపుకు పురోగమిస్తున్నట్లే లెక్క. అర్జునుడు కృష్ణుని ఆదేశముపై, కృష్ణుని కొరకు యుద్ధమే చేయుట దీనికి మంచి ఉదాహరణము. కృష్ణుని కోసము చేసినప్పుడు మాత్రమే మన స్వలాభమును వీడవచ్చును. అట్లు కాని యెడల మంచి వ్యక్తిగా ప్రవర్తించుట లేదా అహింసకు కట్టుబడి యుండుట కూడా వ్యక్తిగత ఆసక్తే కాగలదు. కాబ ట్టి కృష్ణుని తరపున ఏ విధమైన సేవలు చేసినా ఫలాసక్తి లేకుండా చేయుటచే సర్వోన్నత కార్యము కాగలదని దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు సూచించుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Leave a Reply