నింగిలోకి LVM3-M5 !!

- ప్రయోగం సక్సెస్
శ్రీహరికోట నుండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. శనివారం సాయంత్రం LVM3-M5 రాకెట్ ద్వారా CMS-03 ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) లో విజయవంతంగా ప్రవేశపెట్టింది.
ఈ ఉపగ్రహం ద్వారా దేశీయ టెలికమ్యూనికేషన్ సామర్థ్యాలు మరింత విస్తరించనున్నాయని ఇస్రో అధికారులు తెలిపారు. ఈ విజయంతో భారత్ అంతరిక్ష సాంకేతికతలో మరో ముందడుగు వేసింది. ఈ ఉపగ్రహం ఇప్పటివరకు భారత్ ప్రయోగించిన అత్యంత భారమైన కమ్యూనికేషన్ ఉపగ్రహంగా గుర్తింపు పొందింది.
