ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రభుత్వ పాఠశాల (Government school)ల్లో చదువుకునే విద్యార్థుల(students)కు నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థులకు సురక్షిత భోజనం అందడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై హైకోర్టు (High Court) వినూత్నంగా ఆలోచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుల్లో (teachers) ఒకరు ఎందుకు మధ్యాహ్న భోజనం (midday meal) తింటే బాగుంటుంది కదా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తే… శుభ్రమైన, నాణ్యమైన సురక్షిత భోజనం అందే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించింది.
జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (National Commission for Protection of Child Rights) మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ కె.అఖిల్ శ్రీగురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది (lawyer) చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.