LTR Act | కేసుల విచారణలో రాజ్యాంగ స్ఫూర్తి పాటించాలి

LTR Act | కేసుల విచారణలో రాజ్యాంగ స్ఫూర్తి పాటించాలి

LTR Act | గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించిన కేసుల విచారణలో రాజ్యాంగ స్ఫూర్తికి, చట్టాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ వ్యవహరించాలని ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో LTR చట్టాన్ని(Act) ఉల్లంఘిస్తూ గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు అంశంపై హైకోర్టులో విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవని, అభ్యంతరకరమైనవని ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి తెలిపారు. ఆదివాసులపై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగం కల్పించిన హక్కులు, షెడ్యూల్(Schedule) ప్రాంత చట్టాలకు విరుద్ధమని అన్నారు.

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేసే వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు, ఆదివాసీ సంఘాలు ఖండించాలని కోరారు. అలాగే షెడ్యూల్ ప్రాంత కేసుల కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply