AP | బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తర కోస్తాలో భారీ వర్ష సూచన

విశాఖపట్నం : విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరిక కేంద్రం (బుధవారం) బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో (తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు) కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, వచ్చే రెండు మూడు రోజులు మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షపాతం తీవ్రంగా ఉండవచ్చని చెబుతున్నారు. ప్రజలు వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికార సూచనలను పాటించాలని అధికారులు తెలిపారు.

Leave a Reply