Lord Rama | తరతరాలకు ఆదర్శం రామాయణం
- 110 రామాయణ పుస్తకాల పంపిణీ
Lord Rama | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రామాయణం తరతరాలకు ఆదర్శమని శ్రీరాముడు ఆదర్శ పురుషుడని మహనీయుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రాములు అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషద్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఊట్కూర్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సంక్షిప్త రామాయణం 110 పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భావితరాలకు రామాయణం గురించి వివరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. శ్రీరాముడు ఆదర్శ పురుషుడని రామాయణం చదవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండి రామాయణం చదవడంతో పాటు తోటి వారికి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహా కార్యదర్శి లలితమ్మ, ప్రఖండ అధ్యక్షుడు వెంకట్ నారాయణ, ప్రఖండ ఉపాధ్యక్షుడు రఘువీర్, మండల్ అధ్యక్షుడు భీమ్ రాజు, మండల్ కోశాధికారి రఘు, సంఘ పెద్దలు కేశవ్‌రావు, రమేశ్ బాబు, మురళీధర్, అశోక్ బాబు, దాతలు సోమప్ప, డాక్టర్ అనుదీప్ ధర్మ రక్షా ప్రముఖ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

