(ఆంధ్రప్రభ, హైదరాబాద్) : తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) లాంగ్ లీవ్ పెట్టారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు సెలవులు తీసుకున్నారు. కాగా స్మితా సబర్వాల్ స్థానంలో ఐఏఎస్ అధికారి కాత్యాయనీ దేవి (katyayani devi) కి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు స్మిత సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో ట్విట్ షేర్ (Tweet share) చేశారు. కొన్ని రోజులుగా చాలా నొప్పితో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్నానని ఆమె తెలిపారు.

ఈ కారణంగానే స్మితా సబర్వాల్ ఆరు నెలల చైల్డ్ కేర్ లీవ్ (Childcare leave) తీసుకున్నారు. ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం లీవ్‌ను మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో సీఎంఓ అడిషనల్ సెక్రటరీగా పని చేసిన స్మితా సబర్వాల్.. కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాల్లో ముఖ్యపాత్ర పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్మితా సబర్వాల్‌ పై కూడా చర్యలకు సిఫార్సు చేసింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించబోతున్న నేపథ్యం లో ఆమె సెలవు తీసుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

Leave a Reply