ఇది హక్కులను కాలరాయడమే
అధికార పక్ష నేతలకే ఎక్కువ సమయం
కొత్త విధానాలను సృష్టించుకున్న ఎన్డీఏ సర్కారు
సర్కారు తీరుపై మండిపడ్డ రాహుల్ గాంధీ
న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ :
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న తనకు సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో అధికార పక్షం సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి.. తనకు మాత్రం అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. సోమవారం లోక్ సభ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా లోక్ సభలో మాట్లాడే హక్కు తనకు ఉన్నప్పటికీ.. వారు ఈవిధంగా చేయడం ప్రతిపక్షాల హక్కులను కాలరాయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో చర్చలు మొదలవగానే ప్రధాని మోదీ అక్కడినుంచి వెళ్లిపోయారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విషయాల్లో తమకు అనుకూలంగా ఉండే కొత్త విధానాలను సృష్టించుకుంటోందని దుయ్యబట్టారు.
Also Read – TG | రేవంత్ పాలనలో అన్నింటా సీన్ రివర్స్ … భూముల ధరలూ డమాల్
– హరీశ్ రావు
Pingback: Loksabha | ఎయిర్ ఇండియా ప్రమాద ఫైనల్ రిపోర్టు కోసం వెయిటింగ్ - కేంద్ర మంత్రి రామ్మోహన్ - Andhra Prabha | Telugu News D