Lok Adalat | లోక్ అదాలత్‌లో 5025 కేసుల పరిస్కారం
- రూ. 89.43 లక్షల చెల్లింపునకు ఆదేశాలు
Warangal | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా వరంగల్ పోలీస్ కమీషనరేట్(Warangal Police Commissionerate) పరిధిలో 5025 కేసులు పరిష్కార మయ్యాయని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్(Sunpreet Singh) ప్రకటించారు. అలాగే సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.89 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా డ్రంకెన్ అండ్ డ్రైవ్(Drunk and Drive), మోటార్ వెహికల్ చట్టం కేసులు 2533, సైబర్ కేసులు 200, ఇతర కేసులు మరికొన్ని పరిష్కరించినట్లు చెప్పారు. బాధితులకు సంబంధించిన వివిధ బ్యాంక్ ఖాతాల్లో నిలుపుదల చేసిన 89 లక్షల 43 వేల 506 రూపాయలు(89 lakh 43 thousand 506 rupees) అందజేయాలని కోర్టు వారు ఉత్తర్వులు వెల్లడించారని పేర్కొన్నారు. లోక్ అదాలత్(Lok Adalat) ద్వారా ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందని, అవగాహన కల్పించి కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులను ఆయన అభినందించారు.

