Loco Pilots | రైల్వే లోకో పైలట్ల సమస్యలు పరిష్కరించాలి…

Loco Pilots | రైల్వే లోకో పైలట్ల సమస్యలు పరిష్కరించాలి…

  • సౌత్ సెంట్రల్ రైల్వే మద్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

Loco Pilots | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న లోకో పైలట్ల సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ సిహెచ్ శంకర్రావు, సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్రావులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని లోకో క్రూలాబీ ఎదుట లోకో పైలట్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచి చైర్మన్ ఎస్ నాగరాజు, సెక్రెటరీ జీ సాంబశివుడు లు మాట్లాడారు. లోకో పైలట్లకు కేంద్ర ప్రభుత్వం 120 కిలోమీటర్లకు అలవెన్స్ చెల్లించాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమాలు ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతాయని లోకో పైలట్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ట్రెజరర్ షోకేస్ మీనా, నాయకులు నీరజ్ అగర్వాల్, మీనా, వివేక్ లతో పాటు పెద్ద సంఖ్యలో పైలెట్లు పాల్గొన్నారు.

Leave a Reply