Local Body Elections | సర్పంచు, వార్డు సభ్యులకు సన్మానం
Local Body Elections | నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాగిరెడ్డిపేట మండలంలో పద్మశాలీల నుండి ఎంపికైన సర్పంచులు, వార్డు సభ్యులను మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. మండలంలోని జప్తి జానకంపల్లి సర్పంచ్ వర్షిణీతో పాటు 13 మంది వార్డు సభ్యులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనర్సయ్య, జనరల్ సెక్రెటరీ బొమ్మడి రాజయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలు బోగ వెంకటనారాయణ, దూస వెంకటస్వామి, పాగల రాజయ్య, ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షుడు పొశెట్టి, నాగిరెడ్డిపేట మండలాధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు విఠల్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

