Local Body | అడవి సోమన్ పల్లిని అభివృద్ధి చేస్తా
- సేవకుడిలా పని చేస్తా అవకాశం ఇవ్వండి
- ఆశీర్వదించి ఓటెయ్యండి… మరింత అభివృద్ధి చేస్తా
- ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి… ప్రజలందరికీ అందుబాటులో ఉంటా
Local Body | మంథని, ఆంధ్రప్రభ : ప్రతి ఇంటికి అండగా ఉంటా, అడవి సోమన్ పల్లి గ్రామానికి అన్నలా ఉంటా.. స్థానిక సంస్థ(Local Body) ఎన్నికల్లో ఆశీర్వదించి అవకాశం కల్పించాలని కొఠారి బాపు కోరారు. మంథని మండలం అడవి సోమన్ పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొఠారి బాపు ప్రచారంలో తనదైన శైలిలో దూసుకు వెళ్తున్నారు. ప్రజలందరినీ కలుపుకుంటూ… వారితో వారి ఇంటి పెద్దల వ్యవహరిస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు.
గ్రామంలో 228 ఇందిరమ్మ ఇండ్లు(228 Indiramma Houses) మంజూరు చేయించిన, సర్పంచ్ గా గెలిచిన తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలు మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో గ్రామానికి తీసుకొస్తానని ఆయన హామీ ఇస్తున్నారు.
ఆయన తరుపున ప్రజలే ప్రచారం చేయడం విశేషం. ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేస్తే, మీ అందరికీ అండగా ఉంటారని ఆయన తెలుపుతున్నారు. గతంలో ఆయన సతీమణి కొటారి శారద సర్పంచిగా చేసిన సమయంలో అనేక అభివృద్ధి(Development) పనులు మంత్రి శ్రీధర్ బాబు సాయంతో మంజూరు చేయించారు. మరోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన తెలుపుతున్నారు.

