క్యాన్సర్ చికిత్సకు ఎల్‌ఓసీ మంజూరు..

ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాధితుడికి అండగా నిలిచారు. ఆర్ధికంగా చితికిపోయి వైద్యం కోసమై అల్లాడుతున్న అభాగ్యుడి కోసం నేనున్నానంటూ భరోసా కల్పించారు.

హనుమకొండ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నివాసి, క్యాన్సర్ చికిత్స పొందుతున్న మహ్మద్ అదీల్ అహ్మద్‌కు ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.4 లక్షలు మంజూరు చేస్తూ ఎల్‌ఓసి చెక్కును అందజేశారు.

ఈ సందర్భముగా బాధిత కుటుంబసభ్యులు ఎంపీ డా. కడియం కావ్యకు కృతజ్ఞతులు తెలియచేశారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు అండదండగా నిలువాడానికి విశాల హృదయులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తోడ్పాటునందించాలని ఎంపీ డా.కావ్య కోరారు.

Leave a Reply