సాహిత్యం సమాజాన్నిమార్చే ఆయుధం

సాహిత్యం సమాజాన్నిమార్చే ఆయుధం

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్ర‌భ : సాహిత్యమే సమాజాన్నిమార్చే ఆయుధమని సామాజిక మార్పు(Social change) దిశగా ఇకమీదట కలంపోరు చేస్తానని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(DGP Kothakota Srinivas Reddy) అన్నారు.

కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆయన రచించిన పుంజుతోక క్యాక్ టెయిల్ కవితల సంపుటిని ఆయన తల్లిదండ్రులు కొత్తకోట చిన్నసత్యనారాయణ రెడ్డి, కృష్ణవేణిలు ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య(Patti Obulaiah) వ్యవహరించారు. భాషా సాహిత్యాలపై సాధికారత ఉన్నప్పటికీ పుస్తకాన్నితీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదని ఇకమీదట సాహిత్య జీవితం సాగిస్తానని ముఖ్యంగా సాహిత్యంలోకి యువత రావాలనీ, యువత ద్వారానే మార్పు సాధించవచ్చ‌న్నారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ జీ పుల్లయ్య మాట్లాడుతూ.. కవిత్వం ఆకట్టుకుంటుందని కవిత్వం ద్వారా కవులు సమాజానికి ఎంతో సేవ చేస్తారని అన్నారు. పుస్తకాన్ని డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని(Dr. Karnati Chandramoulini) సమీక్షిస్తూ కవిత్వం చదువుతున్నంత‌ సేపు చైతన్యం కలిగిస్తుందని సామాజిక మార్పు దిశగా ప్రయాణం చేస్తుందని అన్నారు.

డాక్టర్ హరికిషన్ మాట్లాడుతూ.. సాహిత్య లోకంలో పోలీస్ అధికారులు చాలా తక్కువగా ఉంటారని సమాజం గురించి ఆలోచించే సమయం దొరకడం గొప్ప విషయమని దాన్నిఅక్షరీకరించడం అరుదైన విషయం అన్నారు. గౌరవ అతిథిగా హాజరైన సాహితీ స్రవంతి(Literary stream) రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ మాట్లాడుతూ.. కవి జీవిత పర్యంతం విలువలతోనే ప్రయాణం చేశాడని జీవితాంతం విలువలను నిలుపుకోవడం తన నిబద్ధతగల జీవితానికి సంకేతం అని అన్నారు.

కవిత్వ ప్రయాణం అంతా మనిషి కేంద్రంగా సాగుతుందనీ, మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టి సమాజాన్నిమార్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ కవిత్వం ఎత్తుగడల ప్రధానంగా సాగుతుందనీ, ఇందులోని కవితలన్నీ నవీన సమాజాన్ని కాంక్షిస్తాయని అన్నారు. కవి ఉద్యోగ జీవితంలోనే కాక సాహిత్య జీవితంలోను కూడా అంకితభావంతో కృషి చేస్తున్నారని ఈ కవిత్వం ద్వారా అర్థమవుతుందన్నారు.

కవి జీవన రేఖల్నిరవీంద్ర విద్యా సంస్థల(Ravindra Educational Institutions) డైరెక్టర్ పీ.బీ సుబ్బయ్య పరిచయం చేశారు. సభలో ఆయన రాసిన కొన్ని కవితల్నిపద్యాలుగా కళాక్షేత్రం కార్యకర్తలు నంది అవార్డు గ్రహీత మహమ్మద్ మియా, బాల వెంకటేశ్వర్లు ఆలపించారు. సభలో పోలీస్ శాఖకు చెందిన అధికారులు(officials) శ్రీనాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, పార్థసారథి, కవులు చౌశా, కేపీఎస్ శర్మ కళాక్షేత్రం కార్యదర్శి యాగంటేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేయగా సభ అనంతరం కవిని ఘనంగా సత్కరించారు

Leave a Reply